Kamal Haasan’s Indian 2 Movie Heroine Declared

  • 6 years ago
Kamal Haasan’s upcoming film, Indian 2 will be directed by Shankar and the music for the project is expected to be composed by Anirudh Ravichander. Nayanthara might be the leading lady opposite Kamal Haasan in his upcoming film, Indian 2.

1996లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం భారతీయుడు. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. కమల్ హాసన్కు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది. ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. అయితే చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. భారతీయుడు చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం కూడా గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు.
ఈ సినిమాను ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించి.. మిగిలిన భాషల్లో డబ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమాకు తెలుగు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో అదరగొడుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార మరో విభిన్నమైన చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఇండియన్2 చిత్రంలో కీలక పాత్రను పోషించడానికి అంగీకారం తెలిపినట్టు కోలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌లో నయనతార చేరికపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనున్నది.

Recommended