Chiranjeevi's shadow Still haunts Pawan, Roja Strong Words On Pawan

  • 6 years ago
Congress Rajya sabha member and Mega star Chiranjeevi's Praja Rajyam shadow is still hunting Jana Sena Chief Pawan Kalyan.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నీడ వదలడం లేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంలో పవన్ కల్యాణ్ పాత్ర ఏమీ లేదు. అయినా దానిపై ఆయన ప్రశ్నలను ఎదుర్కుంటూనే ఉన్నారు.నిజానికి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదు. తన ప్రమేయం లేకుండానే అది జరిగిపోయింది. దానిపై ఆయన సూటిగా మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడినట్లు కనిపించలేదు.ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే ప్రక్రియ విషయంలో తాను నిస్సహాయుడినని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ సమయంలో తన పాత్ర లేదని నర్మగర్భంగా కూడా చెప్పారు
పవన్ కల్యాణ్‌ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించాలని సూచిస్తే ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్‌చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి అని అల్లు అరవింద్ అన్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. "అప్పుడు నాకు అర్ధమైంది ఏమిటంటే అల్లు అరవింద్‌గారు నన్ను నటుడిగానే చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనల్లుడితో పాటు పవన్ కల్యాణ్ అనే వాడు ఒక నటుడంతే. అంతేగానీ, వారికి నాలో ఉన్న సామాజిక స్పృహ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి?" అని సుదీర్ఘ వివరణే ఇచ్చుకున్నారు. అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడినని, కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావని పవన్ కల్యాణ్ అన్నారు.

Recommended